SRCL: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని మల్లయ్య కుంటను కబ్జా చేసి రైస్ మిల్ నిర్మాణం చేస్తున్నారని గ్రామ ప్రజలు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 750 లోని మల్లయ్య కుంటను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలనీ కోరారు.