భారత్ సహా 150 దేశాల్లో అతి త్వరల్లో వాట్సాప్ చానల్స్ ప్రారంభించినట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) తెలిపారు. వివిధ రంగాల్లో సెలబ్రటీలు, ఇతర సంస్థల్ని ఫాలో అయ్యేవాళ్లకు ఈ వాట్సాప్ చానల్స్ (WhatsApp Channels) సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని, మెటా న్యూస్(Meta News), అప్డేట్స్ను పంచుకోవటం ద్వారా వాట్సాప్ ఛానల్స్‌ను విడుదల చేయానున్నారు. త్వరలో ఈ చానల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతాయని, ఎవ్వరైనా తమ చానల్‌ను క్రియేట్ చేసుకోవచ్చునని జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఫీడ్ బ్యాక్ (Feed back) ఆధారంగా మరిన్ని ఫీచర్స్ ఇందులో జోడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన అధికారిక వాట్సాప్ చానల్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ ఇప్పటివరకు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకే పరిమితమైంది.
అయితే దీని పరిధిని మరింత పెంచుకునేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్ వే బ్రాడ్ కాస్ట్ (OneWay brad cost) టూల్‌ను రూపొందించింది. దీని వల్ల వాట్సాప్ కస్టమర్ల నుంచి మరింత ఎంగేజ్మెంట్ పెంచుకునేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెటా సిఇఒ మార్క్ జుకర్ బర్గ్ కొత్త ఫీచర్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తమ అభిమాన హీరో, స్పోర్ట్స్ స్టార్లు, ఫేమస్ క్రియేటర్లు క్రియేట్ చేసిన ఛానెళ్లను వాట్సాప్ యూజర్లు నేరుగా సెర్చ్ చేసే ఛాన్స్ లభించనుంది. ఈ యాప్‌లో ‘అప్డేట్’ ఛానెల్స్ ద్వారా వీరిని ఫాలో అవ్వొచ్చు. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ ఫోన్ల(Smart phone)లో వాట్సాప్ స్టేటస్ స్థానంలో అప్డేట్ పేరుతో ఈ ఫీచర్ వచ్చేసింది.
ఈ విషయాన్ని జుకర్ బర్గ్ తన సొంత ఛానెల్ ద్వారా వెల్లడించారు. వాట్సాప్ నుంచి అప్డేట్లు పొందాలనుకునే వారు అధికారిక వాట్సాప్ ఛానెల్లో జాయిన్ కావొచ్చు.ఈ ఫీచర్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. తన పోటీదారుగా ఉన్న టెలిగ్రామ్(Telegram)లో కూడా ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ లో ‘updates’పేరుతో కనిపించనుంది.whatsapp ఛానెల్స్ ద్వారా మీరు మల్టీ సెలబ్రెటీలు, బిజినెస్అకౌంట్లను ఫాలో అయ్యేందుకు పెద్ద ప్లాట్ ఫామ్‌గా ఉపయోగపడుతుంది.వారందరినీ మీరు నేరుగా యాప్ లోనే కనెక్ట్ కావొచ్చు. వాట్సాప్ ప్రకారం, యూజర్లు ఫ్రొఫైల్ ఫోటో, ఫోన్ నెంబర్ ప్రైవసీగానే ఉంటాయి. ఛానెల్ నిర్వాహకులు లేదా ఇతర ఫాలోయర్లు మీ వివరాలను చూడలేరు.