WhatsApp: 74.2 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్..ఎందుకంటే?
వాట్సాప్ కంపెనీ తమ ఖాతాధారులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భారతదేశంలో మొత్తం 35 లక్షలకు పైగా ఖాాతాలను నిషేధించింది. వాట్సాప్ నివేదికలో ఏం ఉంది? ఎందుకు నిషేధిస్తుందో తెలుసుకుందాం.
WhatsApp: ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఆగస్టులో భారతదేశంలో 74.2 లక్షల ఖాతాలను నిషేధించింది. అయితే గత నెలలో పోలిస్తే ఈ నెలలో 2 లక్షల ఖాతాలను ఎక్కువగా నిషేధించింది. 2021 కొత్త IT రూల్స్‌కు అనుగుణంగా WhatsApp ఈ ఖాతాలను నిషేధించింది. వినియోగదారులకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా దాదాపు 3,506,905 ఖాతాలను భారతదేశంలో నిషేధించినట్లు కంపెనీ పేర్కొంది.
సెప్టెంబర్‌లో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ దేశంలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇందులో 3.1 లక్షల ఖాతాలు ముందస్తుగా నిషేధించబడ్డాయి. దుర్వినియోగాన్ని నిరోధించడం, ఎదుర్కోవడంలో సంస్థ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, దీని కోసం భద్రతా ఫీచర్లు, నియంత్రణలతో పాటు తమ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, సాంకేతిక అభివృద్ధిలో నిపుణుల బృందాన్ని ఎప్పటికప్పుడు నియమించుకుంటున్నట్లు WhatsApp తన అక్టోబర్ నెలవారీ నివేదికలో పేర్కొంది. అకౌంట్స్ యాక్షన్డ్ రిపోర్టు ఆధారంగా కంపెనీ పరిష్కార చర్యలు తీసుకున్న నివేదికలు తెలిపాయి. అంటే ఖాతాను నిషేధించడాన్ని లేదా ఫిర్యాదు ఫలితంగా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది. అలాగే వినయోగదారుల నుంచి అందుకున్న ఫిర్యాదులు ఆధారంగా 24/7 కస్టమర్లకు భద్రత కల్పించడానికి సొంత నివారణ చర్యలు ఉన్నాయని కంపెనీ తన నివేదికలో పేర్కొంది.
కొత్త పోర్టల్‌లో వినియోగదారుల ఫిర్యాదులను ఫైల్ చేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నిర్ణయాలపై అప్పీల్ చేయడానికి ప్రభుత్వం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC) మెకానిజంను ప్రారంభించింది. GAC, వాస్తవానికి, ఆన్లైన్ వివాద పరిష్కార విధానం, Meta, Twitter అనేవి మధ్యవర్తిత్వం చేస్తాయి. వీటి ద్వారా గ్రీవెన్స్ ఆఫీసర్ నిర్ణయంతో బాధపడే వినియోగదారులు కొత్త పోర్టల్ ద్వారా తమ అప్పీల్ ఫిర్యాదును చేయవచ్చు. ఫీచర్ ట్రాకర్ వివరాల ప్రకారం WhatsApp తన అప్లికేషన్ Android వెర్షన్లో చాట్ ఇంటర్ఫేస్ను రీడిజైన్ చేస్తోంది. ఇది కొన్ని రంగులను మార్చడానికి పని చేస్తోంది.