Moveable Wireless HP PC: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌పీ ( HP PC) కొత్త పర్సనల్ కంప్యూటర్ను ఆవిష్కరించింది. పీసీ, వర్క్ కోసం ల్యాప్‌టాప్ వెంట తీసుకెళుతుంటాం. ఇప్పుడు పీసీని కూడా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. కొత్త పీసీని హెచ్‌పీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ల్యాపీ మాదిరిగానే ఇదీ కూడా బ్యాటరీతో పనిచేస్తోంది. సో.. ఎడిటింగ్, గ్రాఫిక్, గేమింగ్ వర్క్ చేసే వారికి ఈ పీసీ చక్కగా పనిచేయనుంది.
ప్రపంచంలో వెంట తీసుకెళ్లగలిగే మొదటి పీసీ ఇదేనని సంస్థ ప్రకటించింది. ఎన్వీ మూవ్ పేరుతో పీసీని తీసుకొచ్చింది. చేతితో సులభంగా తీసుకెళ్లొచ్చు. పీసీకి క్విక్ స్టాండ్ కూడా ఉంది. ఎక్కడైనా పెట్టి పని చేసుకునే వీలు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ టచ్ పాడ్, ఫుల్ సైజ్ కీ బోర్డు ఇచ్చారు. 24 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే ఇచ్చారు. అడాప్టివ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు.
ఇంట్లో మీరు ఎక్కడ ఉన్నారో గ్రహించి స్పేషియల్ ఆడియో ఆన్ చేస్తుంది. మీరు ఉన్న చోట నుంచి సౌండ్ వినొచ్చు. కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిన అవసరం ఉండదు. సినిమాలు చూసే వారు, గేమ్ ఆడేవారికి ఇది సౌకర్యాన్ని ఇస్తోంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్5 మెమొరీ, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో పీసీ వస్తోంది. ధీని ధర ఇండియాలో రూ.75 వేలుగా కంపెనీ నిర్ణయించింది.
హై ఎండ్ పీసీ, అదీ కూడా మూవేబల్గా అందుబాటులోకి రానుంది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కు ఈ పీసీ చక్కగా యూజ్ అవనుంది. విద్యార్థులకైతే ధర కాస్త ఎక్కువగా అవుతుంది. జాబ్ చేసే వారు ఆ ధర ఈజీగా పెడతారు.