»Deepfake Photos Artificial Intelligence Viral News Ai Generated Images
deepfake photos: డీప్‌ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలో చెప్పిన కేంద్రం
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్‌లకు చెక్ పెట్టవచ్చు.
Center on how to spot deepfake photos Artificial Intelligence
deepfake photos: కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. సాఫ్ట్ రంగంలో ఇది విప్లవాత్వకమైన మార్పు అని చెప్పాలి. అంతే కాదు ఇది సెలబ్రెటీల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రఖ్యాత వ్యాపార వేత్తలు ఇలా చాలా మందినే దీనికి బలి అవుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్‌లకు చెక్ పెట్టవచ్చు.
నకిలీలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (press information bureau) ఓ వీడియోను విడుదల చేసింది. చిన్న చిన్న అంశాలను ఉపయోగించి ఏఐతో సృష్టించే ఫేక్ ఫోటోలను గుర్తించవచ్చని అంటుంది. ఫోటోలను కాస్త శ్రద్దగా పరిశీలిస్తే వాస్తవానికి దూరంగా ఉండే చిత్రాలతో పాటు లైటింగ్, షేడ్స్, నీడలను బట్టి గుర్తించవచ్చని వివరించింది. దీనికి సంబంధించిన వీడియోలో అన్ని అంశాలను క్లప్తంగా వివరించింది. నకిలీ ఫోటోలను గుర్తించాలంటే కాస్త జాగ్రత్తగా గమనించాలని, నీడలు, లైటింగ్‌ను బట్టి వాటిని గుర్తించ వచ్చని తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Become an image detective! Spot AI-generated images like a pro!