Wpl : ముంబయిలో అట్టహాసంగా మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం
మహిళల ప్రీమియర్ లీగ్ (Wpl) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్(Dy patel)స్టేడియంలోజరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ,(Kiara Advani) కృతి సనన్ (Kriti Sanon) తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (Wpl) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్(Dy patel)స్టేడియంలోజరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ,(Kiara Advani) కృతి సనన్ (Kriti Sanon) తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత పంజాబీ పాప్ స్టార్ ఏపీ థిల్లాన్ (AP Thillon) కూడా తన పాటలతో అలరించారు. తన హిట్ సాంగ్ ‘బ్రౌన్ ముండే’ను ఆలపించి మైదానంలో సంగీత తరంగాలను వ్యాపింపజేశాడు. ప్రముఖ వ్యాఖ్యాత మందిరా బేడీ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.
కాగా, టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, (Mumbai Indians) గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) కు బెత్ మూనీ సారథ్యం చేపడుతోంది. మ్యాచ్‌లో ఓ జట్టు మ్యాక్సిమన్ ఐదుగురు ఫారెన్ ప్లేయర్స్‌ను ఆడించొచ్చు. ఒకవేళ టీమ్‌లో ఐసీసీ (ICC) అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఉంటే కచ్చితంగా ఒకరిని మ్యాచ్‌లో ఆడించాలి. కానీ దిల్లీ జట్టులో మాత్రమే ఈ ఐసీసీ అసొసియేట్ దేశానికి చెందిన క్రికెటర్ తారా నోరిస్ (అమెరికా) ఉంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా టీ20ల్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్లోనూ ఆధిపత్యం చలాయించనుంది. ఆ జట్టుకు చెందిన ముగ్గురు ప్లేయర్లు..
ఈ డబ్ల్యూపీఎల్‌లో పలు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. యూపీకి అలీసా హీలీ, దిల్లీకి మెగ్ లానింగ్, గుజరాత్‌కు బెత్ మూనీ కెప్టెన్లుగా సెలెక్ట్ అయ్యారు.డబ్ల్యూపీఎల్ (Wpl)జట్ల కోసం ఆయా ఫ్రాంఛైజీలు రూ.4,669 కోట్లు ఖర్చు చేశాయి. దీంతో అమెరికాలోని మహిళల ఎన్బీఏ తర్వాత ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్‌గా డబ్ల్యూపీఎల్ స్థానం దక్కించుకుంది. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ కోసం అదానీ గ్రూప్ రూ.1,289 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో క్రికెటర్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు వెచ్చించాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్ స్మృతి మంధాన(రూ.3.4 కోట్లు) ఆర్సీబీ (RCB) దక్కించుకుంది.ఇకపోతే ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లనూ ఫ్రీగా చూసే ఛాన్స్‌ను మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లను లైవ్‌లో చూడొచ్చు.