టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా టీ20 ట్రై సిరీస్‌లో వారు ఆడనున్నారు.
ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్ సహా దీప్తి శర్మ, స్నేహ రాణా, ఇతర క్రికెటర్లు తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ వీడియోనును ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘స్లేయింగ్ ది ట్రెండ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇకపోతే ఫిబ్రవరి 10వ తేదిన దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా గెలుపు ధ్యేయంగా ముందుకు సాగుతోంది. టీ20 మహిళా వరల్డ్ కప్ కు సంబంధించి భారత్ లోనూ పలు మ్యాచ్ లు ఉండనున్నాయి.