టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘నేను త్వరలోనే పెద్ద ప్రకటన చేయబోతున్నా.. కొంత సమయం వేచి ఉంటే అదేంటో మీ అందరికీ తెలుస్తుంది’ అని రాసుకొచ్చాడు. దాంతో ‘అసలు పాండ్యా ఏం చెప్పనున్నాడు?’, ‘అతడి మనసులో ఏం ఉంది?’ అని అభిమానులు చర్చించుకుంటున్నారు.