KRNL: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా నగరంలో ఈనెల 24న జరిగిన యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో కర్నూలు జిల్లా యోగ సంఘం, యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏం.అవినాశ్ శెట్టి కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్వకేట్ అమిత్ మెహతా ప్రకటించారని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ తెలిపారు.