VZM: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి అంబలం పూజ శుక్రవారం రాత్రి స్థానిక కోట కూడలిలో భక్తిశ్రద్దలతో ఘనంగా జరిపారు. మెట్లతో కూడిన ప్రత్యేక మండపాన్ని అరటిదవ్వలతో తయారు చేసి తల్లిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయ లక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. సుమారు 400 మంది పైడిమాంబ దీక్షాధారులు పాల్గొని తల్లి గీతాలు ఆలపించారు.