పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ మూవీ ‘తేరీ’ సినిమాకు రీమేక్ అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై రచయిత దశరథ్ క్లారిటీ ఇచ్చారు. ఇది ‘తేరీ’కి రీమేక్ కాదని స్పష్టం చేశారు. ఈ మూవీలో పవన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతారన్నారు. అభిమానుల్లో ఈ చిత్రం జోష్ నింపుతుందని పేర్కొన్నారు.