రాష్ట్రంలో ఎస్.సి.,ఎస్.టి. కేటగిరీలకు చెందిన అభ్యర్థుల డి.ఎస్.సి.ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబరు 27 వరకు పొడిగించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.రామానంద శుక్రవారం తెలిపారు.విద్యార్థులు తమ దరఖాస్తులను నేరుగా జ్ఞానభూమి పోర్టల్లో సమర్పించ వచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.