»Virat Kohli Song With Youtuber Yashraj Before The World Cup Odi 2023
ODI World Cup 2023:కు ముందే య్యూట్యూబర్ తో కోహ్లీ సాంగ్
ICC odi వరల్డ్ కప్ 2023కి ముందే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లభించింది. విరాట్ కోహ్లీ(virat Kohli) యాక్ట్ చేసిన ఓ సాంగ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబ్ సింగర్ యష్‌రాజ్(Yashraj)ముఖాటే ఆలపించిన డ్యాన్స్ చేసిన వీడియోలో కోహ్లీ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
virat Kohli song with YouTuber Yashraj before the World Cup odi 2023
ICC ఓడీఐ ప్రపంచ కప్ 2023 కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్సాహాంతో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌లకు ముందే విరాట్ కోహ్లీ(virat kohli), య్యూటూబ్ సింగర్ యష్‌రాజ్ ముఖాటే(yashraj mukhate) కలిసి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. కప్ లాయేగా ఇండియా అనే పాటను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సాంగ్ చూసిన అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో సాంగ్(video song) సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది.
అయితే కోహ్లి దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్న ముఖాటే వీడియోను సరికొత్తగా చూపించారు. కానీ కోహ్లి మాత్రం తొలిసారిగా ముఖాటే గురించి వింటున్నట్లుగా వ్యవహరిస్తాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరుగుతుంది. ఆ క్రమంలో ఐసీసీ ODI వరల్డ్ కప్ 2023 కోసం తాను రూపొందించిన పాటను చూపించమని కోహ్లి ముఖాటేని కోరతాడు. ఆ తర్వాత పాటకు ఇద్దరూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.
ఈ పోస్ట్ అక్టోబర్ 4న షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుంచి ఇది 10 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. దీంతోపాటు లక్షా 50 వేల మందికిపైగా ఇన్ స్టాలో లైక్స్ కూడా చేశారు. మరికొంత మంది అయితే సరికొత్తగా కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి కోహ్లీ యాక్టింగ్ చాలా బాగా చేశారని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి విరాట్‌కు బాలీవుడ్లో అరంగేట్రం చేసే సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు ఇది 2023 ప్రపంచ కప్ గీతం కావాలని మరొకరు పోస్ట్ చేశారు. అద్భుతమైన గీతం భారతదేశం(bharat) ఖచ్చితంగా కప్ తెస్తుందని ఇంకో వ్యక్తి పంచుకున్నారు. అయితే ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా మీ అభిప్రాయం(comment) తెలియజేయండి మరి.