»This Is The Mistake India Made In The First Test Ravi Shastri
SA vs IND: తొలి టెస్ట్‌లో భారత్ చేసిన పొరపాటు ఇదే
సఫారీ గడ్డపై భారత్ తడబడుతోంది. తోలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ చేసిన వ్యూహాత్మక తప్పు గురించి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వివరించారు. బౌలర్లను వాడుకోవడంలో రోహిత్ శర్మ విఫల్ అయ్యారు అని అభిప్రాయపడ్డారు.
This is the mistake India made in the first Test.. Ravi Shastri
SA vs IND: సౌత్ ఫ్రికా(South Africa)తో తలపడుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు (SA vs IND) కాస్త తడబడుతోంది. సఫారీలను ఔట్ చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా(Team india) 245 పరుగులకు ఆలౌట్ అయింది. రెండు రోజుల ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 256/5 స్కోరుతో ముందంజలో ఉంది. డీన్ ఎల్గర్ (140*) సెంచరీతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బౌలర్లను వాడడంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) వ్యూహం బెడిసి కొట్టిందని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇద్దరు పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న వేళ కొత్తవారిని తీసుకురావడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 49/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌తో రోహిత్ బౌలింగ్ చేయించాడు. ఓపెనింగ్ స్పెల్ వేసిన సిరాజ్, బుమ్రాను పక్కన పెట్టాడు. ఇదే వ్యూహాత్మక తప్పిదమని రవిశాస్త్రి అన్నారు. ఏ మ్యాచ్ అయినా ముందు పేసర్లతో వేయించాలని అన్నారు. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడు అదే చెప్పే వాడని తెలిపారు. ఈ విషయంతో కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిపెట్టాలని అన్నారు. లంచ్ బ్రేక్ సమయంలో ద్రవిడ్(Rahul Dravid), రోహిత్ మాట్లాడుకొనే ఈ నిర్ణం తీసుకున్నారని వివరించారు. ఇకపై కాస్త దృష్టి పెడితే విజయానికి చేరుకొవచ్చని హితవు పలికారు.