IND vs AUS 1st Test: తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
గవాస్కర్ టోర్నమెంటులో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా(IND vs AUS) టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా(Team India) స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులోనే కుదేలైంది.
గవాస్కర్ టోర్నమెంటులో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా(IND vs AUS) టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా(Team India) స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులోనే కుదేలైంది. నాగ్‌పూర్ వేదికగా మొదటి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 132 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. అశ్విన్(Ashwin), జడేజా(Jadeja) బౌలింగ్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.
టీమిండియా ఘన విజయం:
𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝗡𝗮𝗴𝗽𝘂𝗿! #TeamIndia 🇮🇳 win by an innings & 1️⃣3️⃣2️⃣ runs and take a 1️⃣-0️⃣ lead in the series 👏🏻👏🏻
What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻
రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు జడేజా, షమీ తలో రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. 223 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టుకు ఆరంభంలోనే అశ్విన్ షాకిచ్చాడు. ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసి వరుసగా వికెట్లను పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు వార్నర్, లబుషేన్ నిలదొక్కుకునే ప్రయత్నిం చేసినా లాభం లేకుండా పోయింది. వారి పోరాటం ఎక్కువ సేపు సాగలేదు. వార్నర్‌ను అశ్విన్ ఔట్ చేయగా లబుషేన్‌ను జడేజా పెవిలియన్ దారి పట్టించాడు.
Ashwin 🤝 Fifers
How good has @ashwinravi99 been with the ball in the second innings 🔥🔥
ఇకపోతే అశ్విన్(Ashwin) స్పిన్ ఉచ్చులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చిక్కుకుని వరుసగా పెవిలియన్ దారి పట్టారు. చివరి ఆరు వికెట్లను కూడా ఆస్ట్రేలియా కేవలం 50 పరుగులకే కోల్పోవడం విశేషం. 25 రన్స్‌తో స్టీవ్ స్మిత్ నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. 321 పరుగులతో మూడో రోజును కొనసాగించిన టీమిండియా(Team India) 400 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా(Team India) బ్యాటర్లు అయిన అక్షర్ పటేల్, షమీ ఇద్దరూ కలిసి టీమిండియా స్కోరును 400కు చేర్చారు. అక్షర్ 84 పరుగులు చేయగా షమీ 37 పరుగులు చేశారు. తొలి టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో మొత్తం నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంతో ముందంజలో నిలిచింది.
A splendid five-wicket haul in the second innings from @ashwinravi99 inspires #TeamIndia to a comprehensive victory in the first #INDvAUS Test 🙌🏻
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ లు కట్టడి చేశారు. అశ్విన్ ఈ టెస్ట్ మ్యాచ్ లో 450వ వికెట్ ను పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా రికార్డుకెక్కాడు. ఇకపోతే రవీంద్ర జడేజా వరుసగా 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీ చేయడంతో మూడు ఫార్మాట్లు అయిన వన్డే, టెస్ట్, టీ20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు లిఖించాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు.