మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ మ్యాచ్ భాగంగా నేడు పాక్ తో టీమిండియా(IND vs PAK) తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యం ఉంది.
మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ మ్యాచ్ భాగంగా నేడు పాక్ తో టీమిండియా(IND vs PAK) తలపడుతోంది. మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ నెగ్గిన పాక్ బ్యాటింగ్ చేపట్టింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యం ఇస్తోంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన పాక్ 8 పరుగులకు ఒక వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ జవేరియా ఖాన్ 8 పరుగులు చేసి ఔటయ్యింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో ఆమె షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యింది. హర్మన్‌ప్రీత్ క్యాచ్ అందుకోవడంతో జేవేరియా పెవిలియన్ దారి పట్టింది. దీంతో, పాకిస్థాన్ 10 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 31 రన్స్ చేసింది. 12 పరుగులు చేసి మునీబా అలీ ఔట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 149 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యం ఉంది.
It’s match day! 😍 Clear your calendar, cause it’s the big one! 💪