»Team India Cricketer Virat Kohli Is On The Verge Of Another Record If He Scores Two More Centuries He Will Break The Record Held By Cricket Legend Sachin Tendulkar
Virat Kohli: సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లీ
టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు శతకాలు కొడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసి విరాట్ భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ వరల్డ్ కప్‌లో విరాట్ మొదటి సెంచరీ ఇదే. అయితే వన్డేల్లో 48వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి. మిగతా 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 26,000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.
క్రికెట్ హిస్టరీలో 100 సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు సచిన్.. వన్డేల్లో 49 శతకాలు బాదాడు. ప్రస్తుతం కోహ్లీ 48 సెంచరీలు కొట్టాడు. మరో 2 శతకాలు కొడితే సచిన్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అవుతుంది. ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనెను అధిగమించి కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండుల్కర్( 34, 357 పరుగులు), కుమార సంగక్కర(28,016 పరుగులు), రికీ పాంటింగ్(27,483 పరుగులు) మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. కోహ్లీ(26,026 పరుగులు), జయవర్ధనె(25,957 పరుగులు) నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు.