మూడో వన్డేలో కూడా టీమిండియా దుమ్మురేపింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యం చేధించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. తొలి ఓవర్లోనే హర్థిక్ పాండ్యా ఫిన్ అలెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. డివాన్ కాన్వే, హెన్రీ నికొలాస్ జోడి నిలకడగా ఆడింది. వారిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుల్లీప్ యాదవ్‌కు నికొలాస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత మిచెల్ కూడా ఔటయ్యాడు. వెంటనే టామ్ లాథామ్ క్యూ కట్టాడు. కాన్వే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 138 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వీరవిహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. లేదంటే స్కోర్ 400 పైచిలుకు అయ్యేది. అయినప్పటికీ మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. కివీస్‌ను వైట్ వాష్ చేసింది. తొలి రెండు వన్డేల్లో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.