Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అరుదైన ఘనత సాధించారు. రెండోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రదర్శనకు గానూ గిల్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపిక చేసింది. ఈ ఏడాది జనవరిలో కూడా గిల్‌కు అవార్డు వచ్చింది. ఏడాదిలో రెండుసార్లు అవార్డు దక్కడం విశేషం.
2021 జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తోంది. భారత్ నుంచి రిషబ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద అవార్డు గెలుచుకున్నారు. గిల్ మాత్రం రెండు సార్లు గెలుచుకున్నారు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ల షకీబ్ అల్ హసన్, ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు రెండుసార్లు వరించింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడుసార్లు గెలుచుకుని టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
వన్డే వరల్డ్ కప్ కన్నా ముందు గిల్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డారు. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌లో ఆడలేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడినప్పటికీ కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ వన్డే వరల్డ్ కప్‌లో భారత్ హవా కొనసాగుతోంది. వరసగా విజయాలు నమోదు చేయడంతో వన్డేలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. టీ20, టెస్టుల్లో కూడా నంబర్ వన్ ర్యాంకింగ్ టీమిండియాదే.