తొలి టీ20 (T20) మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ మహిళా జట్టు ఘన విజయం సాధించింది. మూడు మ్యాచుల ఈ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ టీ20 మ్యాచులో 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. నాట్ స్కివర్ బ్రంట్ 77, డేనియల్ వ్యాట్ 75 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
🇮🇳🏏 NOT OUR DAY! Let's take the positives and come back stronger on Saturday!
భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్ ఒక వికెట్ తీశారు. ఆ తర్వాత 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ 52, హర్మన్ ప్రీత్ కౌర్ 26, రిచా ఘోష్ 21, స్మృతి మంధాన 6, జెమీమా రోడ్రిగ్స్ 4 పరుగులు చేసి విఫలం అయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లు, నాట్ స్కివర్ బ్రంట్, ఫ్రెయా కెంప్, సారా గ్లెన్లు చెరొక వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించారు. ఈ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో టీమిండియా మహిళా జట్టు మరో రెండు టీ20 మ్యాచుల్లో తలపడనుంది.