Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు కోలుకున్నట్టే.. వచ్చే ఏడాది జనవరిలో టీమిండియాతో జత కలుస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ వరకు పంత్ (Rishabh Pant) ఫిట్‌గా ఉంటాడట.. ఆ సిరీస్ ఆడతారని సమాచారం.
గతేడాది డిసెంబర్ 30వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ (Rishabh Pant) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం 70 శాతం కోలుకున్నాడు. ఫిట్ నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో కష్ట పడుతున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. గాయంతో జట్టుకు బుమ్రా దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడు. ఆ సిరీస్‌కు బుమ్రా నేతృత్వం వహిస్తాడు. గాయలబారిన పడ్డ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగా కోలుకుంటున్నారు. ఆసియా కప్ కోసం వీరిద్దరూ ఫిట్ నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు.
విండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. ఆ జట్టుకు పాండ్యా నేతృత్వం వహించాడు. ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా కెప్టెన్‌గా ఉంటారు. ఆసియా కప్ నుంచి సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అందుబాటులోకి వస్తారు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఉంటుంది. అదీ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ ఉంటుంది.