భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9వ తేది నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ మొత్తం 4 మ్యాచ్‌లతో ముగియనుంది. సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక మూడో మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఉంటుంది.
నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లు హాజరుకానున్నారు. భారత్ – ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మార్చి 9 నుంచి 13వ తేది వరకు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఆ టైంలోనే ఆసీస్ ప్రధాని భారత్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధాన మంత్రులు మ్యాచ్‌ను వీక్షించనున్నారు. టీమిండియా వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఈ సందర్భంగా టెస్ట్ సిరీస్‌ను కూడా టీమిండియా సొంతం చేసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.