»Namibian Batter Jan Nicol Creates World Record Fastest Century In T20
Jan Nicol : చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్.. 33బంతుల్లోనే సెంచరీ
నమీబియా స్టార్ బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Jan Nicol : నమీబియా స్టార్ బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నేపాల్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో నికోల్ లాఫ్టీ ఈ ఘనత సాధించాడు. ఈ నమీబియా బ్యాటర్ మ్యాచ్ ఆద్యంతం బౌండరీల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో నికోల్ 36 బంతుల్లో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి, టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా నేపాల్ బ్యాట్స్‌మెన్ కుశాల్ మల్లా రికార్డు సృష్టించాడు. ఈ నేపాలీ బ్యాట్స్‌మెన్ ఆసియా క్రీడలు 2023లో భాగంగా మంగోలియాపై కేవలం 34 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిట్ మిల్లర్ రికార్డును బద్దలు కొట్టారు.
ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ టీ20లో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మంగళవారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్-నమీబియా టీ20 మ్యాచ్‌లో కుశాల్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని జాన్ నికోల్ 33 బంతుల్లోనే వారి రికార్డులన్నింటినీ బ్రేక్ చేశాడు. నికోల్ సెంచరీతో నమీబియా భారీ స్కోరు చేసింది. నేపాల్ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్(101) సెంచరీ చేయగా, క్రుగర్(59) హాఫ్ సెంచరీతో రాణించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ కూడా ధైర్యంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ పౌడల్ (48), కుశాల్ (32), దీపేందర్ (48) పరుగులతో రాణించారు. కానీ వికెట్లు కోల్పోవడంతో నేపాల్ ఓడిపోయింది. నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.