»Mohammad Kaif Warned Team India During India Australia Match If This Continues World Cup May Slip Away
Mohammad Kaif: టీం ఇండియాను హెచ్చరించిన కైఫ్.. ఇలాగే ఉంటే ప్రపంచ కప్ సాధించినట్లే ?
మొహాలీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు చాలా పేలవమైన ఫీల్డింగ్ చేసింది. భారత జట్టు కొన్ని సులభమైన క్యాచ్‌లను వదులుకోగా, కొన్ని రనౌట్ అవకాశాలను కూడా కోల్పోయింది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు.
Mohammad Kaif: మొహాలీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు చాలా పేలవమైన ఫీల్డింగ్ చేసింది. భారత జట్టు కొన్ని సులభమైన క్యాచ్‌లను వదులుకోగా, కొన్ని రనౌట్ అవకాశాలను కూడా కోల్పోయింది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఫీల్డింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్ల మధ్య సఖ్యత కూడా తెరపైకి వచ్చింది. ఇది చూసిన మహ్మద్ కైఫ్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే సందర్భంగా మహ్మద్ కైఫ్ వార్నింగ్ టోన్‌లో ట్విటర్లో పోస్ట్ చేశాడు, “టీమ్ ఇండియా క్యాచ్‌లు పట్టుకోకపోతే ప్రపంచ కప్ జారిపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ద్వారా మ్యాచ్ గెలవవచ్చు, కానీ క్యాచింగ్ కూడా ముఖ్యం. అంటూ రాసుకొచ్చారు. మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ డేవిడ్ వార్నర్ సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. అప్పుడు వార్నర్ 14 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత 53 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో పాటు ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా కూడా పేలవంగా ఫీల్డింగ్ చేశారు. భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రెండుసార్లు రనౌట్ అయ్యే అవకాశాలను కోల్పోయాడు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది. అయితే, ఈ టోర్నీలోనూ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ విషయమై పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ ను హెచ్చరించారు.