»Kohli Wanted To Marry Actress Play For India Inside Cheeks Slam Book Entry From Childhood
Virat Kohli: ఎంత బలంగా కోరుకున్నాడో.. అదే జరిగింది…!
మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో అదే జరిగింది. ఆయన చిన్నతనంలో బలంగా కోరుకున్నది పెద్దయ్యాక సాధించాడు. అదేెంటో ఇప్పుడు చుద్దాం.
ఇంతకీ మ్యాటరేంటంటే.. చిన్నతనంలో మనలో చాలా మంది స్లామ్ బుక్స్ రాసే ఉంటారు. మన ఫ్రెండ్ స్లామ్ బుక్ లో మన వివరాలు రాస్తూ ఉంటాం. దాంట్లో మన వివరాలు, ఫోటోతో పాటు లైఫ్ యాంబిషన్ కూడా రాసే ఉంటారు. మీరు ఆ స్లామ్ బుక్ లో ఏం రాశారో నిజంగా ఇప్పుడు గుర్తుండకపోవచ్చు. కానీ కోహ్లీ(Virat Kohli) మాత్రం.. తాను చిన్నప్పుడు తన ఫ్రెండ్ స్లామ్ బుక్ లో ఏం రాశాడో, అదే సాధించాడు.
కోహ్లీ తాను పెద్దయ్యాక ఇండియన్ క్రికెటర్(cricketer) అవుతానని రాశాడు. దానిని నిజం చేసుకున్నాడు. అక్కడితో అయిపోలేదు. తాను ఓ హీరోయిన్ ని పెళ్లి(heroine marriage) చేసుకుంటానని కూడా రాశాడు. అన్నట్లుగానే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడాడు. తాజాగా, కోహ్లీ స్లామ్ బుక్ లో రాసిన వివరాలు బయటకు రావడంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
కోహ్లీ జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను ఆర్సీబీ(RCB) ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. దానిలో ఈ వివరాలు ఉండటం విశేషం. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక, ఈ వీడియోలో కోహ్లీ చిన్ననాటి క్రికెట్ కోచ్ రాజ్ కుమార్ శర్మ మాట్లాడారు. కోహ్లీ చిన్నతనం నుంచే చాలా యాక్టివ్ గా ఉండేవాడని, 10 ఏళ్ల వయసులోనే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకున్నాడని ఆయన చెప్పారు. కోహ్లీ సహజంగానే టాలెంటెడ్ క్రికెటర్ అని మెచ్చుకున్నారు. కోహ్లీ పెద్దయ్యాక చాలా గొప్పవాడు అవుతాడాని తాను ముందే గుర్తించానని చెప్పడం విశేషం.
Stories from Virat Kohli’s childhood in Delhi
We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 5, 2023