»India Team Announced For World Test Championship Final
Indias Test squad: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు ప్రకటన
భారత క్రికెట్ బోర్డు (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ఏప్రిల్ 25న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే టీమ్ ఇండియా జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) మంగళవారం ప్రకటించింది. ఈ టెస్టు జట్టుకు అజింక్యా రహానె.. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం రహానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్నాడు. అంతేకాదు అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉన్నాడు. మరోవైపు గాయం కారణంగా శ్రేయర్ అయ్యర్ ఈ టెస్టుకు దూరమయ్యాడు. WTC ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌లో జరగనుంది.
ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా 15 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 5 మంది పేస్ అటాక్‌లో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇందులో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ కూడా ఉన్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని భావిస్తుండగా, కేఎల్ రాహుల్ కూడా జట్టులో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమైన వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలగించబడ్డాడు.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.