»Delhi Capitals Beat Sunrisers Hyderabad Won By 7 Runs
SRH: మారని ఫేట్… సొంత గడ్డపై సన్ రైజర్స్ కి తప్పని ఓటమి..!
ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే…మొదట టాస్ ఢిల్లీ గెలిచింది. దీంతో… ఢిల్లీ(delhi Capitals) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు కూడా నిజానికి భారీ స్కోర్ చేయలేదు కానీ.. లక్ తో గెలిచిందని చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేయగలిగింది. జట్టులో మనీశ్ పాండే (34: 27 బంతుల్లో 2×4), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించారు. కానీ.. ఓపెనర్ సాల్ట్ (0), మిచెల్ మార్ష్ (25: 15 బంతుల్లో 5×4) , డేవిడ్ వార్నర్ (21: 20 బంతుల్లో 2×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (10), అమన్ హసీమ్ ఖాన్ (4) కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ రెండు, టి.నటరాజన్ ఒక వికెట్ తీశాడు.
తర్వాత లక్ష్య చేధన కోసం రంగంలోకి దిగిన సన్ రైజర్స్(Sunrisers hyderabad) మరీ పేలవంగా ఆడింది. సింపుల్ టార్గెట్ ని కూడా చేరుకోలేక చతికిలపడిపోయింది. లాస్ట్ లో పుంజుకునే సరికి వికెట్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (49: 39 బంతుల్లో 7×4) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడినా.. అతనికి ఎవరూ సపోర్ట్ అందించలేకపోయారు. హారీ బ్రూక్ (7), రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5), ఆడెన్ మార్క్రమ్ (3) వరుసగా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయారు.
దాంతో హైదరాబాద్ టీమ్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. హైదరాబాద్(Sunrisers hyderabad) విజయానికి చివరి 30 బంతుల్లో 56 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (31: 19 బంతుల్లో 3×4, 1×6), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్: 15 బంతుల్లో 3×4) కాస్త దూకుడుగా ఆడి హైదరాబాద్ టీమ్‌లో గెలుపు ఆశలు రేపారు. కానీ హెన్రిచ్ ఔట్ తర్వాత సుందర్ బాధ్యత తీసుకోలేకపోయాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అవగా.. కేవలం 5 పరుగుల్నే సన్‌రైజర్స్ రాబట్టగలిగింది. ఢిల్లీ బౌలర్ ముకేష్ కుమార్ చాలా తెలివిగా యార్కర్లు వేసి సుందర్‌ని కట్టడి చేశాడు. ఇంకేముంది విజయం ఢిల్లీ ఖాతాలోకి వెళ్లిపోయింది.