Ind Vs Aus: కుప్పకూలిన ఆస్ట్రేలియా..టీమిండియా టార్గెట్ 115
టీమిండియా(Team India) స్పిన్నర్లు మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా, భారత్(Ind Vs Aus) రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా(Team India) స్పిన్నర్లు మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా, భారత్(Ind Vs Aus) రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) మరోసారి విశ్వరూపం చూపించాడు. ఏకంగా 7 వికెట్లను ఈ ఇన్నింగ్స్ లో పడగొట్టాడు. అశ్శిన్(Ashwin) 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఒక్క పరుగు ఆధిక్యంలో ఉండగా తాజాగా రెండో ఇన్నింగ్స్(Second Innings)లో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం ఉంది.
Innings Break!
It was a @imjadeja show here in Delhi as he picks up seven wickets in the morning session.
Australia are all out for 113 runs. #TeamIndia need 115 runs to win the 2nd Test.
నేడు ఓవర్ నైట్ స్కోర్ 61/1తో మూడో రోజు ఆటను ఆస్ట్రేలియా ప్రారంభించింది. ఓవైపు జడేజా(Jadeja), మరోవైపు అశ్విన్(Ashwin) చెలరేగడంతో ఒకానొక దశలో ఆస్ట్రేలియా 95 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత 24వ ఓవర్లో రవీంద్ర జడేజా వరుసగా రెండు వికెట్లను పడగొట్టాడు. మొదటి బంతికి కాంబ్, రెండో బంతికి కమ్మిన్స్ పెవిలియన్ కు చేరారు.
ఢిల్లీ టెస్టులో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసి ఆలౌట్(All Out) అయ్యింది. ఆ తర్వాత భారత జట్టు 262 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్(1st Innings) లో కంగారూ జట్టు ఒక్క పరుగు ఆధిక్యం ఉండగా రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులు చేసింది. దీంతో భారత టార్గెట్(Team India Target) 115గా నిలిచింది.