»If India Do Not Win In The Third T20 The Series Will Be Lost Harthik Pandyas Big Loss
INDvsWI T20: టీమ్ ఇండియా పరువు కాపాడుకుంటుందా?
టీమ్ఇండియా మొత్తం స్టార్ ఆటగాళ్లే ఉన్నారు. ఒంటి చేత్తో గెలిపించే బ్యాటర్లు. ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టించే బౌలర్లు ఉన్నారు. అయినా వెస్టిండీస్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్నారు. మరీ ఈరోజు జరిగే మ్యాచ్‌లో నెగ్గకపోతే.. మరీ టీమ్ వెనుకపడడానికి కారణం ఏంటి.? లోపం ఎక్కడ అనేది విషయంపై సమీక్షిద్దాం.
If India do not win in the third T20, the series will be lost. Harthik Pandya's big loss
INDvsWI T20: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా(West Indies Vs Team India) టీ20 సరీస్‌లో భారత్ 0-2 తో వెనుకంజలో ఉంది. ఈ సిరీస్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో, తరువాతి ఆటలో రెండు వికెట్ల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ నేడు మూడవసారి తలపడనుంది. ఆదివారం ఎక్కడైతే 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిందో అదే మైదానంలో(ప్రావిడెన్స్, గయాన) మళ్లీ పోటీ పడనుంది. మందకొడి పిచ్‌లపై చెలరేగుతున్న విండీస్ బౌలర్లను మరోసారి ఎదుర్కొవడం టీమ్ ఇండియా బ్యాటర్ల(Batmens)కు సవాలే. అలాగే వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు పూరన్(Puran)ను మన బౌలర్లు కట్టడి చేయాల్సి అవసరం ఉంది. లేదంటే 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో టీమ్ఇండియాకు తొలి ఓటమి ఎదురౌతోంది. ఈ గేమ్ ఓడితే అనామక విండీస్ చేతిలో సిరీస్ కోల్పోయిన అపఖ్యాతిని మూటగట్టుకోనుంది. అది తప్పించుకోవాలంటే మూడో టీ20లో భారత్ గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో భారత్.. వెస్టిండీస్‌తో చావో రేవో తేల్చుకోనుంది. దీనికోసం భారత్ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించాలి.
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్సీలోని టీమిండియా ఎందుకు వెనుకంజ వేసింది అనేది నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మన వాళ్లలో గెలవాలన్న కసి కనిపించడం లేదని, అలాగే ఐక్యమత్యం లోపాలు ఓటమికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా మన బ్యాటర్లు ఆట తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వన్డేల్లో రాణించిన గిల్, ఇషాన్ కిషన్ పామ్ కొల్పియినట్లు చాలా సాధాసీదాగా ఆడుతున్నారన్నారు. అంతే కాకుండా ఇండియన్ స్టార్ బ్యాట్‌మెన్స్‌గా పేరున్న సూర్యకుమార్, శాంసన్, హార్దిక్ త్వరగా పెవిలియన్‌కు వెళ్లడం జట్టును దెబ్బతీస్తోంది. భారత జట్టులోకి కొత్తగా వచ్చిన హైదరాబాదీ(Hyderabad) తిలక్‌వర్మ(Tilak Varma) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడని అన్నారు. అతనికి మిగతా వారి నుంచి సహకారం లభిస్తేనే భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కోసం పోటీపడుతుందని పేర్కొన్నారు. అలాగే బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ చివరి మ్యాచ్‌లో సరైన ఆటతీరును కనబరుచలేదు. దారుణంగా పరుగులు ఇచ్చాడు. అతని స్థానంలో అవేశ్‌ఖాన్, ఉమ్రాన్ మాలిక్ లలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. చాహల్‌కు తోడు కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.