Wrestlers: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు (Wrestlers) గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వారికి చాలా మంది ప్రముఖులు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లు (Wrestlers) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోడ్డుపైన నిరసనలు తెలియజేయబోమని స్పష్టంచేశారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని.. సమస్యను అక్కడే చెప్పుకుంటామని తేల్చిచెప్పారు.
బ్రిజ్ భూషణ్‌పై (brij bhushan) చార్జీషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నేరవేర్చిందని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు వెయిట్ చేస్తామని తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై (brij bhushan) తమ పోరాటం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.
బ్రిజ్ భూషణ్ (brij bhushan) కొందరు రెజ్లర్లను లైంగికంగా వేధించాడని, మ్యాచ్‌లలో ఆడించలేదని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు (delhi police) కేసు ఫైల్ చేయలేదు. మైనర్ రెజ్లర్ ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం కేసు ఫైల్ కాలేదు. దీంతో బ్రిజ్ భూషణ్‌కు కాస్త ఊరట కలిగింది.