వెస్టిండీస్‌తో జరుగుతున్న 2వ టెస్టులో బరిలోకి దిగిడం ద్వారా పేసర్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇది అతడికి 50వ టెస్టు మ్యాచ్. బుమ్రా ఇప్పటికే వన్డేలు(89), టీ20ల్లో(75) 50కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ 50 మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా, భారత్ తరఫున 7వ ప్లేయర్‌గా నిలిచాడు.