టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా 10 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అతని క్రికెట్ నైపుణ్యంపై ఎవరికీ సందేహం లేదని చెప్పాడు. పృథ్వీ షా దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చాడు. కానీ, అతనికి అతనే శత్రువు.. తిరిగి గాడిలో పడాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించాడు.