»David Warner Warners Century In Pak Match Australia Score 367
PAK vs AUS: పాక్ బౌలింగ్‌లో వార్నర్ ‘తగ్గేదే లే’..ఆసీస్ స్కోర్ 367
ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆసీస్ 367 పరుగులతో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ విజృంభించారు. ఇద్దరూ సెంచరీలతో రాణించడంతో పాటు పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో పాక్ ముందు 368 పరుగుల టార్గెట్ నిలిచింది.
వన్డే వరల్డ్ కప్ (ODi World Cup-2023)లో నేడు పాకిస్తాన్ (Pakistan), ఆస్ట్రేలియా (Australia) జట్లు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (David warner), మిచెల్ మార్ష్ (Mitchell Marsh) పోటాపోటీగా సెంచరీలు చేశారు.
An explosive partnership of 259 runs between David Warner and Mitchell Marsh was Australia's highest-ever ICC Men's Cricket World Cup stand for the first wicket 💪#CWC23 | #AUSvPAKpic.twitter.com/OjkFdEXzlp
డేవిడ్ వార్నర్ (David warner) 85 బంతుల్లోనే సెంచరీ (Century) చేయడం విశేషం. మార్ష్ కూడా 100 బంతుల్లో సెంచరీ చేశాడు. పాక్ బౌలింగ్‌కు వార్నర్, మార్ష్ ఊచకోత కోశారు. ఆరంభంలోనే వార్నర్ క్యాచ్ ఇచ్చినప్పటికీ దానిని పాక్ ఆటగాడు ఉసామామిర్ మిస్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ సాగే కొద్దీ వార్నర్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు.
https://twitter.com/i/status/1715332964580733278
ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తవ్వగానే డేవిడ్ వార్నర్ పుష్ఫ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ చేయగానే తగ్గేదే లే అంటూ గడ్డం కింద చేయి పెట్టి పుష్ఫలో అల్లుఅర్జున్ లాగా చేశాడు. దీంతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఆ తర్వాతి బంతికే మార్ష్ సెంచరీ చేయడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. డేవిడ్ వార్నర్ తగ్గేదే లే అంటూ పుష్ప స్టైల్లో సెంచరీ సెలబ్రేట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా:
ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ వంటి సీనియర్ బౌలర్లు ఆసీస్ బౌలర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యారు. మొత్తంగా డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 163 పరుగుల చేయగా, మిచెల్ మార్ష్ 121 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 5 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా, ఉసామా మీర్ ఓ వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా 367 పరుగులు చేయడంతో పాక్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. 368 పరుగులు చేస్తే విజయం సాధించే అవకాశం ఉంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాక్ బ్యాటర్లు కూడా విజృంభించాల్సి ఉంది.