వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. స్మృతీ మంధాన (62) అర్ధశతకం, రిచా ఘోష్ (32) పరుగులతో రాణించారు. ఇక విండీస్ బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, డీన్డ్రా, ఎఫీ ఫ్లెచర్, హెన్రీ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.