ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ మెనింజైటిస్ బారిన పడి కోమాలోకి వెళ్లాడు. గత వారం రోజులుగా కోమాలో ఉన్న ఆయన, తాజాగా స్పృహలోకి వచ్చాడు. ‘మార్టిన్ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నాడు. మాతో మాట్లాడుతున్నాడు.. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు’ అని ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపాడు. కాగా, మార్టిన్ ఆస్ట్రేలియా తరఫున 65 టెస్టులు, 208 వన్డేలు ఆడాడు.