ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరు(Bangalore)తో జరుగుతున్నమ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్లు సిక్సర్లతో హోరెత్తించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) (3) విఫలమైనా, ఆ తర్వాత మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చెన్నై బ్యాటర్ డేవాన్ కాన్వే (Devon Conway) (83) దంచికొట్టాడు. శివమ్ దుబే (52) హాఫ్ సెంచరీ చేశాడు. అజింక్య రహానే (37), అంబటి రాయుడు (14) పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3) పేలవ ప్రదర్శన చేశాడు. మెయీన్ అలీ (19*), జడేజా (10*) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) (1), పార్వెల్ (1), విజయ్ కుమార్ (1), హసరంగ (1), హర్షల్ పటేల్ (1), మ్యాక్స్వెల్ (1) వికెట్లు పడగొట్టారు.ఇక సొంతగడ్డప 227 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఎలా ఛేదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో ఆకాశ్ సింగ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ (6) బౌల్డయ్యాడు.