కోల్‌కతా వేదికగా శుక్రవారం నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే ఈ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానిక కాళీఘాట్ కాళీ ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించాడు.