Azharuddin disqualified from contesting HCA elections
Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు షాక్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది.
తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అజారుద్దీన్ హెచ్‌సీఏ రాజ్యాంగానికి విరుద్దంగా చర్యలు చేపట్టినందుకు అతడిని అధ్యక్షపదవి నుంచి తొలగించింది. దుబాయ్‌లో టీ10 టీమ్‌ను కలిగి ఉన్నాడని, అక్కడి క్రికెట్ క్లబ్లో మెంబర్‌గా ఉన్నాడన్నా ఆరోపణలతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అతడిని సస్పెండ్ చేసింది. దానిపై అజార్ రీపిటిషన్ వేసి పోరాడుతుండగా.. తన ఫిర్యాదును రివ్యూ చేసిన కౌన్సిల్ తాజాగా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసింది.