»Asian Games 2023 This Is The Worst Record In T20s All Out For 15 Runs
Asian Games 2023: టీ20ల్లో చెత్త రికార్డ్ అంటే ఇదే..15 పరుగులకే ఆలౌట్
ఆసియా గేమ్స్‌లో భాగంగా ఇండోనేషియా, మంగోలియా మహిళా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఓ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయ్యి టీ20ల్లో చెత్త రికార్డును నమోదు చేసింది.
క్రికెట్ చరిత్రలో మరో చెత్త రికార్డు నమోదైంది. టీ20ల్లో కేవలం 15 పరుగులకే ఓ జట్టు ఆలౌట్ అయ్యింది. 20 ఓవర్ల మ్యాచ్‌లో 20 పరుగులు కూడా చేయకపోవడం మరో విశేషం. ఈ ఘటన చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చారు. ఇందులో భాతర మహిళా, పురుషుల జట్టు కూడా పాల్గొనబోతున్నాయి. అయితే ఆ మ్యాచులు చూసేందుకు మరికొంత సమయం ఉంది.
ఆసియా గేమ్స్‌లో భాగంగా ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండోనేషియా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన మంగోలియా జట్టు కేవలం 20 పరుగులు కూడా చేయలేకపోయింది. మంగోలియా టీమ్ చేసిన స్కోరు 15 పరుగులు మాత్రమే. అందులో కూడా 5 ఎక్స్‌ట్రాలు రావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో మంగోలియా జట్టు (Mongolia Team) కేవలం 15 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో చెత్త రికార్డుగా నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా (Indonesia) 172 పరుగుల తేడాతో విజయాన్ని పొంది ఆసియా గేమ్స్ (Asian Games 2023)లో బోణి కొట్టింది.
భారత్ క్రికెట్లో చారిత్రాత్మక పతకాన్ని ఉమెన్స్ టీమిండియా ఖాయం చేసుకుంది. తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొని సెమీ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక రేపటి ఫైనల్ మ్యాచులో గెలుస్తుందో లేదో చూడాలి మరి.