రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై క్రికెటర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ ప్రకటించే రోజంతా అశ్విన్ తో కలిసే ఉన్నానని.. అయినాతనకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ‘చివరి నిమిషాల్లో రిటైర్మెంట్ గురించి నాకు తెలిసింది. మీడియా సమావేశానికి ఐదు నిమిషాల ముందే తెలిసింది. నాకు ఇది షాకింగ్‌గా అనిపించింది’ అని అన్నాడు.