బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. KKRతో నిన్న జరిగిన మ్యాచ్లో CSK 32 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉందని రుతురాజ్ పేర్కొన్నాడు. తొలి 7-8 ఓవర్ల తర్వాత వికెట్ ఒక్కసారిగా మారిపోయిందన్నాడు. ముందుగా తాము 220 పరుగులు చేయాలనుకున్నామని, కానీ వికెట్ తీరు చూశాక 180-190 స్కోరు సరిపోతుందని భావించామన్నాడు.