ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో విఫలమైన విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు చాలా కీలకం అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఓటమిని ఓ పట్టాన కోహ్లీ అంగీకరించడని.. టీమ్‌లో అతడు స్ఫూర్తిని నింపుతాడని కైఫ్ అన్నాడు.