ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 28 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి స్టంప్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (40 పరుగులు), సాయి సుదర్శన్ (16 పరుగులు) ఉన్నారు.