భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో తన నంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా (904) పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్గా ఆశ్విన్ రికార్డును సమం చేశాడు. కాగా, అశ్విన్ 2016లో ఈ ఘనత సాధించాడు.