గబ్బా టెస్టులో టీమిండియాను ‘ఫాలో ఆన్’ గండం నుంచి టెయిలెండర్లు ఆకాశ్ దీప్ (27*), బుమ్రా (10*) తప్పించారు. వీరిద్దరూ పదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. భారత్ ‘ఫాలో ఆన్’ తప్పించుకోవడానికి చేరువయ్యాక ఆకాశ్, బుమ్రాకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ సందేశం పంపినట్లు కేఎల్ రాహుల్ వెల్లడించాడు. షాట్లు ఆడకుండా సింగిల్స్‌తో పరుగులు సాధించాలని కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ సందేశం పంపినట్లు తెలిపాడు.