ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు (February 14') ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఆరోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు (Valentine's Day) వాలెంటైన్స్ డే జరుపుకొంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు (February 14′) ఫిబ్రవరి 14’వ తేదీనే ఎంచుకుంటారు. ఆరోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు (Valentine’s Day) వాలెంటైన్స్ డే జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక రోజు వాలైంటైన్స్ డేను జరుపుకుంటే కొరియ దేశంలో యువత మాత్రం ప్రతినెల 14 న ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు.ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను ‘డైరీ డే’గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును ‘(Candle Day)’క్యాండిల్ డే’గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు.వాలెంటైన్స్ డే
(ఫిబ్రవరి 14)
ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు (Korea) కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు (Return gift) రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు.
వైట్ డే (మార్చి 14)
వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే(white day) ‘వైట్ డే’ కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క(Chocolate gift) చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు.
బ్లాక్ డే (ఏప్రిల్ 14)
వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత( Black day) బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని (youth )యువత కాస్త ఒత్తిడికి గురవుతారు.
ఎల్లో డే (మే 14)
ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. (Valentine’s Day) వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14)ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు.