దేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వేలమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహాయంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్‌నగర్ డివిజన్ (Sarurnagar Division) ఎస్బీఐ కాలనీలో నివాసముండే డా.వింజమూరి సూర్యప్రకాశ్(Dr. Vinjamuri Suryaprakash), కామిని దంపతులు. డాక్టర్ గా కావల్సినంతా సంపాదించుకోనే ఈ రోజులో వేలది మంది ఆకలి తీర్చడంలోనే ఎంతో ఎంతో సంతృప్తి ఉందంటూ 15 సంవత్సరాలుగా ఓపెన్ హౌజ్(Open House )పేరుతో ఆకలితో వచ్చిన వారికి ఆహారం, విడిది సౌకర్యం కల్పిస్తున్నారు.
దేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వేలమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహాయంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్‌నగర్ డివిజన్ (Sarurnagar Division) ఎస్బీఐ కాలనీలో నివాసముండే డా.వింజమూరి సూర్యప్రకాశ్(Dr. Vinjamuri Suryaprakash), కామిని దంపతులు. డాక్టర్ గా కావల్సినంతా సంపాదించుకోనే ఈ రోజులో వేలది మంది ఆకలి తీర్చడంలోనే ఎంతో ఎంతో సంతృప్తి ఉందంటూ 15 సంవత్సరాలుగా ఓపెన్ హౌజ్(Open House )పేరుతో ఆకలితో వచ్చిన వారికి ఆహారం, విడిది సౌకర్యం కల్పిస్తున్నారు. 24గంటలూ సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పరబ్రహ్మ స్వరూపమో కాదోగానీ ప్రాణాలను మాత్రం కాపాడుతుంది. హైదరాబాద్ నగరంలో ఆకలితో ఉండేవారికి తమ వంతు సహకారం అందించాలన్న ధ్యేయంతో ఓపెన్ హౌజ్‌ను ఏర్పాటు చేశారు. ఆ వైద్య దంపతులు. ఆకలితో అలమటించేవారిని కళ్లారా చూసి చలించిపోయారు. అలాంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఓపెన్ హౌజ్ ప్రారంభించి ప్రారంభించి ఆకలి బాధలు తీరుస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. 4గంటలు అందుబాటులో..ఎస్బీఐ కాలనీలో(SBI Colony) 340 గజాల విస్తీర్ణంలో 2006 సంవత్సరంలో ఇళ్లు నిర్మించారు. రెండు అంతస్తులున్న ఆ ఇంట్లో నలుగురు వలంటీర్లను ఏర్పాటు చేశారు.
జిల్లాల నుంచి నగరానికి వచ్చి రాత్రి పూట వెళ్లలేని వారు. ఉద్యోగం(job) కోసం వచ్చి వసతిలేని నిరుద్యోగులు, (unemployed) చదువుకునేందుకు వచ్చి ఇబ్బందులు పడే విద్యార్థులు, దిక్కులేక తిండి దొరకని అన్నార్తులు ఎవరైనా సరే, ఏ పని మీద వచ్చినా సరే అవసరం లేదు. ఆకలి (hunger) తీర్చడమే ఏకైక లక్ష్యం. ఇక్కడ ఏ సమయమైనా సరే వచ్చి వండుకుని తిని సేదతీర వచ్చు. తమతోపాటే సేవ చేయాలనుకునే మరి కొందరి సహకారంతో ఈ ఓపెన్ హౌజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వంట చేసుకోవడానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు, గ్యాస్ స్టవ్ తదితరాలు అందుబాటులో ఉంచుతారు. ఎస్బీఐ కాలనీలో 340 గజాల విస్తీర్ణంలో 2006 సంవత్సరంలో ఇళ్లు నిర్మించారు. రెండు అంతస్తులున్న ఆ ఇంట్లో నలుగురు వలంటీర్లను ఏర్పాటు చేశారు.
జిల్లాల నుంచి నగరానికి వచ్చి రాత్రి పూట వెళ్లలేని వారు. ఉద్యోగం (job) కోసం వచ్చి వసతిలేని నిరుద్యోగులు, చదువుకునేందుకు వచ్చి ఇబ్బందులు పడే విద్యార్థులు, దిక్కులేక తిండి దొరకని అన్నార్తులు ఎవరైనా సరే, ఏ పని మీద వచ్చినా సరే అవసరం లేదు. ఆకలి తీర్చడమే ఏకైక లక్ష్యం. ఇక్కడ ఏ సమయమైనా సరే వచ్చి వండుకుని తిని సేదతీర వచ్చు. తమతోపాటే సేవ చేయాలనుకునే మరి కొందరి సహకారంతో ఈ ఓపెన్ హౌజ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వంట చేసుకోవడానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు, గ్యాస్ స్టవ్ తదితరాలు అందుబాటులో ఉంచుతారు.ఆకలి తీర్చే కల్పతరువుగా ఉన్న ఈ ఓపెన్ హౌజ్‌కు ప్రతి నిత్యం 30నుంచి 60మంది వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈ హౌజ్ నిర్వహణకు ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదంటున్నారు నిర్వాహకులు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత సేవ చేసే ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటాయని, తాము ప్రచారం కోసం చేయడం లేదని నిర్వాహకులు తెలిపారు.ఈ ఓపెన్‌హౌజ్(అందరి ఇల్లు) విద్యార్థులు,
నిరుద్యోగ యువతకు వరంగా మారింది. పోటీ పరీక్షలకు (competitive exams) సిద్ధమయ్యే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యన ఏర్పాటు చేసిన మంచ, గ్రంథాలయం, ప్రశాంత వాతావరణం దీని సొంతం. వేల రూపాయలు ఖర్చు చేసినా ప్రైవేటు హాస్టళ్లలో ఇలాంటి వసతిని పొందలేమని పలువురు వెల్లడించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిచెన్‌లో సులువుగా వంట చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. సమాజంలో ఎవరూ కుడా ఆకలితో అలమట్టించవద్దు. తోటి వారి ఆకలిని చూసి చలించిపోయి ఉన్నదాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో 2006లో ఓపెన్ హౌజ్‌ను(మన ఇల్లు) స్థాపించామని. తమతో చేతులు కలిపి స్నేహితులు సహాయం ఇస్తామంటేనే తీసుకుంటున్నాం. పై అంతస్తుల్లో పగటి వేళ క్లినిక్ కొనసాగిస్తూ ఓపెన్ హౌజ్ నిర్వాహణ కొనసాగిస్తున్నాం. దీనిని చాలామంది స్ఫూర్తిగా తీసుకొని చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది మా కోరిక.