తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పలువురు నేతలు పార్టీలు మారుతుండగా..ఇంకొంత మంది తమ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో YSRTP అధినేత వైఎస్ షర్మిల(ys sharmila) ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా చెన్నూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్(balka suman) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నవేళ వీటి ప్రధానోత్సవం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ గేమ్‌లో భాగంగా ఎన్నికల స్టంటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది నిజమేనా అనేది ఇప్పుడు చుద్దాం.
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడరని, వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వైసీపీ నాయకుల ఫిర్యాదుతో నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి బీఆర్‌ఎస్ మొండిచేయి చూపడంతో నిరాశే మిగిలింది. దీంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు
తనకు ప్రాణహాని ఉందని, అది కూడా టీడీపీ నేత నారా లోకేష్ నుంచేనని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు.
టికెట్ దక్కనివారిని బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ (BRS) ప్రయత్నిస్తోంది.స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) కు కాకుండా కడియం శ్రీహరికి టిక్కిట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాజయ్య తో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ హన్మకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. రాజయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో కాసేపు అక్కడే వేచి చూసి వెళ్లిపోయారు. కాగా రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం ఇస్తుందని ...
యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వస్తారని జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను తాను ఏమీ అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.