Mla Rajaiah Cried: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (Rajaiah) తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తనకు టికెట్ రాకపోవడంతో బోరున విలపించారు. అనుచరుల మందు సాష్టాంగ నమస్కారం చేసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయనను చూసి అనుచరులు కూడా ఏడ్చారు. తనకు టికెట్ ఇవ్వకున్నా సరే.. సీఎం కేసీఆర్కు వీర విధేయుడినని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేశానని.. ఉన్నత స్థానం ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. టికెట్ ఇవ్వకున్నా ఫర్లేదు.. ప్రజల్లో ఉంటా.. ప్రజలకు సేవ చేయడం తనకు ఇష్టం అని తెలిపారు.
బీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిన్న విడుదల చేశారు. దాదాపు అన్నీ సిట్టింగులకు కేటాయించారు. కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్న స్థానాల్లో మార్పులు చేశారు. అలా ఘనపూరం నుంచి రాజయ్యకు (Rajaiah) టికెట్ దక్కలేదు. కడియం శ్రీహరికి టికెట్ ఖరారు చేశారు. ఇటీవల కడియం- రాజయ్య (Rajaiah) మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజయ్యను పిలిపించుకొని మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. నియోజకవర్గంలో రాజయ్యపై అసంతృప్తి నెలకొంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారనే అపవాదు ఉంది. అందుకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవీ నుంచి అప్పట్లో తప్పించారనే వార్తలు వినిపించాయి. నియోజకవర్గంలో గల మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల అసభ్య ప్రవర్తించారు. సర్పంచ్ నవ్య.. రాజయ్య లీలలను బయటకు తీసుకొచ్చారు.
ఇలా వ్యతిరేకత ఉండగా.. టికెట్ దక్కదనే ప్రచారం జరిగింది. ఈ సారి కడియంకే టికెట్ అని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఇటీవల రాజయ్య (Rajaiah) రాజశ్యామల యాగం కూడా చేశారు. అయినప్పటికీ ఆయనపై ఉన్న నెగిటివిటీ నేపథ్యంలో టికెట్ దక్కలేదు. కడియం శ్రీహరిని అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది.