స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం అరెస్టు అయ్యారని ఈ మేరకు గుర్తు చేశారు.
తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది యువకులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని, వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు ఈ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు.
నేటితో జగన్‌కు బెయిల్ వచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు 30కిపైగా కేసులు ఉన్న జైలు మోహన్ సీఎంగా ఉన్నారని, జనాల్లో ఉండాల్సిన చంద్రబాబు జైలులో ఉన్నారని కామెంట్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(skill development scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు శుక్రవారం సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబును నేడు, రేపు సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే అసలు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు. బాబు ఏం సమాధానం చెబుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే(malkajgiri mla) మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తు ప్రకటించారు. అయితే త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వస్తానని అన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ నేతల తీరుతో ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి జరిగే సమావేశాలకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా మంత్రి అంబటి రాంబాబు, నందమూరి బాలకృష్ణ మధ్య సరికొత్త సంఘటన చోటుచేసుకుంది. బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన తెలుపగా..అంబటి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు ఏమన్నారో ఇప్పుడు చుద్దాం.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. నాయుడు కస్టడీ శుక్రవారంతో ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆన్ లైన్ విధానంలో చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడారు. ఆ క్రమంలో న్యాయమూర్తి హిమ బిందు కస్టడీని రెండు రోజులు పొడిగించారు. ఆయన జ్యుడీషియల్...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP assembly session 2023) రెండో రోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలు కాగానే టీడీపీ సభ్యులు(tdp members) స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ వేస్తు నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న కీలక నేత విజయశాంతి తాను ఉన్న పార్టీలోని నేతలపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ కామెంట్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే నిరసనకు దిగడంతో ఏపీ స్పీకర్ 14 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలు కావడంతోనే గందరగోళానికి దారితీశాయి. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చ కోసం వాయిదా తీర్మానం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మరోవైపు బాలకృష్ణ మీసం తిప్పడంపై వైసీపీ నేత అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పైగా గెలుస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కేసీఆర్ దోపిడీ తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవం(telangana liberation day) వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా ఈ దినోత్సవం గురించి పలు పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టం అందరికీ సమానమేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు సాక్ష్యాలు, ఆధారాలతో అడ్డంగా, నిలువుగా దొరికిపోయారని అన్నారు. నిడదవోలులో వైఎస్‌ఆర్ కాపు నేస్తం’ నిధులను నాలుగో ఏడాది విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మోసాలు, వెన్నుపోట్లు పొడిచినా చివరికి తప్పులు చేస్తే అరెస్టు కాక తప్పదన్నారు....